జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జవహర్ నగర్ లో సతీష్ నేతా ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు అదేవిధంగా స్థానిక నాయకులందరూ పాల్గొనడం జరిగింది.