భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, జాతీయవాది డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా, మేడ్చల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, కొంపల్లి డివిజన్ బీజేపీ అద్యక్షులు పెద్దబుద్ధుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. భారత జాతి ఐక్యతకు వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు సరిత రావు, జిల్లా నాయకులు శివాజీ రాజు, శంకర్ నాయక్, అశోక్, కొంపల్లి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.