కామరాతి బీరప్పస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మల్లారెడ్డి

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్లలో శ్రీ శ్రీ శ్రీ కామరాతి బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి క్యామా మల్లేష్ కురుమ, బోడుప్పల్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి, బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయర్, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త రవి గౌడ్, రాష్ట్ర హమలి సంఘం నాయకులు హమలి శ్రీనివాస్, పిర్జాదిగూడ మాజీ కార్పొరేటర్ కౌడే పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్