మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేధా కంపెనీ ఎదురుగా ఈగ మహేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మేధా కంపెనీలో పనిచేస్తున్న అతను రోడ్డు దాటుతుండగా, ట్యాంకర్ డ్రైవర్ అతివేగంతో, అజాగ్రత్తగా నడపడం వల్ల ఢీకొట్టడంతో వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.