బాచుపల్లిలో ఘోర అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రగతినగర్ ప్రాంతంలో వరుసగా ఉన్న ఫర్నిచర్ షాపుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక షాపులో సిలిండర్ పేలడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటలు పక్క షాపుల్లోని ఫర్నిచర్‌కు కూడా వ్యాపించాయి. దట్టమైన పొగతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్