శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధి బొమ్మరాసిపేటలో భారీ చోరీ

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మరాసిపేటలో నాగేశ్వరరావు ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి సుమారు 20 తులాల బంగారం, 2 లక్షల నగదును అపహరించుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇటీవల బంగారం ధరలు పెరగడంతో శామీర్ పేట పరిధిలో గొలుసు దొంగతనాలు, వరుస చోరీలు పెరిగి పోలీసులకు సవాల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్