కొండాపూర్ లో భారీ చోరీ

ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ వైష్ణవి రెసిడెన్సీలో భారీ చోరీ జరిగింది. ఈ నెల 14న నవీన్ కుమార్ తన కుటుంబంతో కలిసి స్నేహితుడి ఇంటికి వెళ్లి బుధవారం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి కిటికీ పగులగొట్టి ఉంది. దుండగులు బెడ్రూమ్ బీరువా తెరిచి 18 తులాల బంగారు ఆభరణాలను అపహరించినట్లు గుర్తించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕