మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు మహమ్మద్ మోహిన్ షరీఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. గత వారం రోజుల క్రితం ఘట్కేసర్ టౌన్ మేడపాటి నగర్ కాలనీలో నివాసం ఉండే సునీత అనే మహిళ ఇంట్లో వెండి వస్తువులు దొంగలించబడ్డాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఘటన స్థలంలో లభ్యమైన వేలిముద్రల ఆధారంగా శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.