మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ప్రభుత్వంలో అవినీతిని ఎదుర్కోవడానికి ప్రజలను ప్రోత్సహించడం కమిటీ ముఖ్య ఉద్దేశమని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డా. చంటి ముదిరాజ్ అన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్లా మండల కేంద్రం శామీర్‌పేటలోని బృంధావన్ ఇన్ హలులో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ మేడ్చల్ జిల్లా కార్యాచరణ సదస్సు జరిగింది.