బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ వెంకటాపురంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఆహ్వానం మేరకు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి దర్శనం చేసుకున్నారు. దేవస్థానం అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని వజ్రేష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్