మేడ్చల్: బండ్లగూడ ఫారెస్ట్ లో చెలరేగిన మంటలు

ధమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని బండ్లగూడ ఫారెస్ట్ లో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చెత్త అంటుకోవడంతో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను ఆర్పేశారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్