మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూతనకల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.