కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేసిఆర్ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో ఏర్పాటు చేసిన ఛలో వరంగల్ కార్యక్రమంలో పాల్గొని గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్బంగా మల్లారెడ్డి మీడియతో మాట్లాడుతూ కేసిఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.