మేడ్చల్: రేషన్ బియ్యం దించుతూ గుండెపోటుతో హమాలీ కూలీ మృతి

జవహర్ నగర్లో విషాదం నెలకొంది. స్థానిక బీజేఆర్ కాలనీలో రేషన్ షాపులో బియ్యం దించుతుండగా హమాలీ మక్తయ్య(50) గుండెపోటుతో మరణించారని సీఐటీయూ నేతలు తెలిపారు. అధిక బరువును మోయలేక అతడు మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్