మేడ్చల్: విషాదం.. సెల్ఫీ వీడియో తీస్తూ బాలుడు మృతి

బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్న 17 ఏళ్ల బాలుడు, స్నేహితుడితో కలిసి కారులో వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం తుర్కపల్లి జీనోంవ్యాలీ పరిధిలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది. కారు నడుపుతున్న బాలుడు సెల్ఫీ వీడియో తీస్తుండగా, పక్కనే ఉన్న బాలుడు హ్యాండ్ బ్రేక్ లాగడంతో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుడి బంధువు, కారు నడిపిన బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. పండుగ రోజునే కొడుకు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్