కార్మికుల సంక్షేమం కోసం తలసాని శంకర్ యాదవ్ ఎంతో కృషి చేశారని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం షామీర్ పేటలోని తుర్కపల్లి బాలాజీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన శంకర్ విగ్రహాన్ని మాజీమంత్రులు మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ లతో కలిసి హరీష్ రావు ఆవిష్కరించారు.