మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ తెలంగాణ సంప్రదాయ పండుగ బోనాల పండుగ, ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర మంతటా ఉమ్మడి శామీర్ పేట్ మండలం లోని పలు గ్రామాల్లో బోనాల పండుగను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. వివిధ గ్రామాలలో బోనాల పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. ఆదివారం బోనాల పండుగ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పలు గ్రామాల్లో నిర్వహించిన బోనాల పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.