సిట్ విచారణకు హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం కార్యాలయం రాజీవ్ రహదారిపై కేసీఆర్ కాన్వాయ్ వెళ్తుండగా, బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు పూలతో ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ కాన్వాయ్ పై పూలు చల్లుతూ, 'జై కేసీఆర్, జై జై కేసీఆర్' అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులను చూసిన కేసీఆర్ కాసేపు తన కాన్వాయ్ ను ఆపి వారికి అభివాదం చేశారు.