హైదరాబాద్-వరంగల్ రహదారిపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా

మేడిపల్లి వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం హెచ్‌పీకి చెందిన ఖాళీ పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నంబర్-102ను ఢీకొట్టింది. ముందున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో ట్యాంకర్ ముందు భాగం దెబ్బతినగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్