ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు

మేడ్చల్ మండలంలోని సెయింట్ క్లారెట్ పాఠశాలలో ప్రభుత్వం నిషేధించినప్పటికీ పుస్తకాల విక్రయం జోరుగా కొనసాగుతోందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నించగా పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. ఒక విద్యార్థికి 7000 నుండి 10000 వరకు పుస్తకాల రేట్లు నిర్ణయించి వారి వద్దనే కొనుగోలు చేయాలని నిబంధనలు పెట్టడం సరైన పద్ధతి కాదని స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్