మేడ్చల్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, సుచిత్ర సెంటర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యూటర్న్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీఎన్ఆర్ మాల్లో సినిమా చూసి కొంపల్లికి బైక్పై వెళ్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చికిత్స పొందుతూ భర్త అర్జున్ సర్దా(38) మృతి చెందగా, భార్య గుర్జన్ సర్దా(34) పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. కారు పోలీసుల వద్ద ఉన్నా డ్రైవర్ను అరెస్ట్ చేయలేదని బాధితుల కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ, న్యాయం చేయాలని పోలీసులను కోరుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.