చిన్న క్రాంతి కాలనీ కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు

మేడ్చల్ లోని చెంగిచెర్ల చిన్న క్రాంతి కాలనీ అసోసియేషన్ బృందం, బీజేపీ నాయకులు ఏర్పుల మహేష్ తో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ ఈటల రాజేందర్ ని చిన్న క్రాంతి కాలనీ అసోసియేషన్ కమ్యూనిటీ హాలు నిర్మాణం గురించి కలవడం జరిగింది. దానికి వారు గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్, చిన్న క్రాంతి కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా చిన్న క్రాంతి కాలనీ కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్