మేడ్చల్ పట్టణంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాలలో మంగళవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ట్రాఫిక్ సిఐ మధుసూదన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ఉల్లంఘిస్తే ప్రమాదాలు జరుగుతాయని, చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. వాహనదారులు, పాదచారుల భద్రత కోసమే ఈ నిబంధనలున్నాయని, ప్రమాదాల వీడియోలు ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.