ఓవిద్యార్థి హాస్టల్బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్శిటీలో 3వ ఏడాది చదివే హరినాథ్ పురుగుల మందు తాగి, వసతిగృహం 3వ అంతస్తు నుంచి కిందికి దూకాడు. ఈక్రమంలో ఆయనకు విద్యుత్ వైర్లు తగిలి తీవ్రగాయాలు అయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.