మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ రాఘవేంద్ర కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని శ్యామసుందర్ మార్చి 28న ఇంటికి తాళం వేసి కామారెడ్డి వెళ్లారు. పొరుగువారు తాళాలు పగిలి ఉండటాన్ని గమనించి సమాచారం అందించడంతో, ఇంటికి వచ్చి చూడగా 21 తులాల వెండి వస్తువులు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.