సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందించిన తోటకూర వజ్రేష్ యాదవ్

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని దండు మరియమ్మకు రూ. 25,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి పద్మారెడ్డి మాట్లాడుతూ, నిరుపేదలకు ఆరోగ్య భద్రత, ఆర్థిక భరోసా కల్పించడంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని, కార్పొరేట్ వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఒక వరమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్