మియాపూర్‌లో 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకిన తల్లి మృతి

మియాపూర్‌లో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. మయూరి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఈషా సాహూ (37) తన ఆరు నెలల కుమార్తెతో కలిసి ఆరో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటనలో ఈషా సాహూ అక్కడికక్కడే మృతి చెందగా, శిశువుకు స్వల్ప గాయాలయ్యాయి. సమీపంలోని ఫెన్సింగ్ కారణంగా శిశువు ప్రాణాపాయం నుంచి బయటపడింది. చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రెండో బిడ్డ జననం తర్వాత ఈషా సాహూ తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్