హైదరాబాద్‌లోని రాంనగర్‌లో ప్రేమ్‌కుమార్ (36) అనే వ్యక్తి లోన్ యాప్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. మూడువేల రూపాయల లోన్ చెల్లించాలంటూ వేధింపులు, న్యూడ్ ఫోటోలు పంపిస్తామని బెదిరింపులు ఎదుర్కొన్నట్లు అతని భార్య నాగవేణి తెలిపారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. లోన్ ఏజెంట్లు కుటుంబ సభ్యులను కూడా బెదిరించినట్లు అనుమానిస్తున్నారు. మృతుడి ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.