కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభలో సోమవారం ఆరోపించారు. మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, RRR, ఐఐఎం (IIM) వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం దారుణమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని, తాడిచెర్ల బొగ్గు గనుల విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు.