హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును నిన్న సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయనను ఈరోజు వైద్య పరీక్షల నిమిత్తం సీఐడీ అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిని కూడా తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మల్కాజ్ గిరి కోర్టులో హాజరుపరచనున్నారు.