భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నరేందర్ అనే వ్యక్తి తన భార్య తేజశ్రీ(25)ని రోకలిబండతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. గొడవ కారణంగా ఆగ్రహానికి గురైన నరేందర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో తేజశ్రీ అక్కడికక్కడే మృతిచెందింది. భార్యను హత్య చేసిన అనంతరం నరేందర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.

సంబంధిత పోస్ట్

✕
✕