గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో 23 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. కొందరికి పదోన్నతులు ఇస్తూ కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులకు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశాలు జారీయ్యాయి.