జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 23 నుంచి రిజిస్ట్రేషన్లు

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 23 నుంచి ప్రారంభమై మే 2వ తేదీ వరకు కొనసాగుతుంది. జేఈఈ మెయిన్స్‌లో కనీస ర్యాంకులు సాధించిన తొలి 2.50 లక్షల అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్ష మే 17వ తేదీన నిర్వహిస్తారు. పరీక్ష రెండు పేపర్లలో ఉదయం 9-12, మధ్యాహ్నం 2:30-5:30 గంటల మధ్య జరుగుతుంది.

సంబంధిత పోస్ట్