హైడ్రాలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు

ఒకప్పుడు హేళనకు గురైన ట్రాన్స్‌జెండర్లు ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీని కాపాడే సింగంలుగా మారారు. 2017లో ప్రతిపాదనకు వచ్చిన ఈ ఆలోచన వాస్తవరూపం దాల్చి, 16 మంది ట్రాన్స్‌జెండర్లతో కూడిన హైడ్రా 'ఈగల్ టీమ్' అక్రమ కట్టడాల కూల్చివేతలు, ప్రభుత్వ భూముల రక్షణలో చురుగ్గా పాల్గొంటోంది. ఈదులకుంట, అమీన్‌పూర్ ఆపరేషన్లలో వీరి సహనం, ధైర్యం అధికారులను ఆకట్టుకున్నాయి. వీరి సేవలు ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి.

సంబంధిత పోస్ట్