ముషీరాబాద్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగమయ్య కుంటలో ఓ వ్యక్తి ఆత్మహత్య. ఛత్రినాకకు చెందిన శివ రామకృష్ణ (28) రెండు రోజుల క్రితం పెళ్లి అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మహిళ బంధువుల ఫిర్యాదుతో పోలీసులు శివ రామకృష్ణని, మహిళని పట్టుకొచ్చి, మందలించి ఇంటికి పంపించారు. మనస్థాపానికి గురైన శివ రామకృష్ణ వాల్ల బాబాయ్ ఇంటికి వచ్చి ఎవ్వరూ లేని సమయంలో ఇంటిపైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.