గంజాయి బ్యాచ్ హల్‌చల్.. హాస్పిటల్ సిబ్బందిపై కత్తితో దాడి

హైదరాబాద్ వనస్థలిపురంలో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేశారు. జెమ్ కిడ్నీ ఆస్పత్రి ముందు మందు తాగొద్దన్నందుకు సిబ్బందిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. హాస్పిటల్ రిసెప్షనిస్ట్‌ విద్యాసాగర్‌పై ఆరుగురు యువకులు దాడి చేశారు. దీంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత గంజాయి బ్యాచ్ అక్కడి నుంచి పరారయ్యారు.

సంబంధిత పోస్ట్