తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉన్నాయని, కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని అనడం వివేకమా అని ప్రశ్నించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాలని మంత్రి పొన్నం కోరారు.