ముషీరాబాద్: స్కూల్ కు తాళం.. రోడ్డు మీద టీచర్లు

ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని భాగలింగంపల్లిలో స్కూల్ రీఓపెన్ చేద్దామని ప్రిన్సిపాల్ వెళ్లితే ఆ భవనం ఓనర్ అడ్డు తగిలారు. ముషీరాబాద్లోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఈ ఘటన వెలుగు చూసింది. '13 నెలలుగా బిల్లు రాలేదని ఓనర్ అంటున్నారు. క్లాసులు ప్రారంభిద్దామని వస్తే గేటుకు తాళం వేశారు. ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు. అధికారులు చొరవ తీసుకోవాలి. టీచర్లను రోడ్డు మీద నిలబెడితే పాఠాలు ఎలా చెప్పాలి.' అంటూ ప్రిన్సిపాల్ వాణిశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్