వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు శనివారం రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు. కింగ్‌కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఆయనను హిమాయత్‌నగర్‌లోని జడ్జి నివాసానికి తరలించి ప్రవేశపెట్టారు. కేసుపై వాదనలు విన్న తర్వాత జడ్జి రిమాండ్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.