ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలంటూ బీసీ వెల్పేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరాపార్కులో జరిగిన బీసీ విద్యార్థుల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి ఫీజు చెల్లింపుతో పాటు, పీజు రెగ్యులేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. బీసీ హాస్టళ్లకు స్వంత భవనాలు, గురుకులాల్లో అర్హులైన విద్యార్థులకు సీట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.