జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు బీసీ బంద్ పథకం ప్రవేశపెట్టి, ప్రతీ బీసీ కుటుంబానికి రూ.20 లక్షలు ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆదివారం డిమాండ్ చేశారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో 14 బీసీ సంఘాలతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డా. అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ.20 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.2000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని కూడా ఆయన కోరారు.