విద్యా వైద్య రంగాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలీ...

విద్యా, వైద్య రంగాలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని, విద్యారంగంలో ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం పెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్య, వైద్య రంగాలు కార్పొరేట్ సంస్థలను నియంత్రించలేకపోతున్నాయని, పేద, మధ్యతరగతి ప్రజల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తున్నాయని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం కాకుండా పది కిలోలు ఇవ్వాలని కూడా ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్