హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం తెలంగాణ బడ్జెట్ 2026 భవిష్యత్తు ఆకాంక్షలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తలు, విద్యావంతులు బడ్జెట్‌పై సామాజిక, ఆర్థిక, అభివృద్ధి కోణంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఏఎస్కే కన్వీనర్ డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షతన, సమన్వయకర్త హెచ్ రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు డాక్టర్ దాసోజు శ్రవణ్, డాక్టర్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన జరగాలని వక్తలు సూచించారు.