శాసనసభ ఆవరణలో గాంధీ విగ్రహానికి స్పీకర్ నివాళి

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ అవరణలోని గాంధీ విగ్రహానికి రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, శాసనసభ్యులు, కార్యదర్శులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, శాసనమండలి కార్యదర్శి డా. వి. నరసింహ చార్యులు, శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్