కులగణనలో తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నేతకాని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జూన్ మూడో వారంలో భారీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సాయిని ప్రసాద్ నేత మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి ప్రారంభమయ్యే నిరసనలు జిల్లా కేంద్రాల వరకు కొనసాగి, చివరికి 'హలో నేతకాని - చలో హైదరాబాద్' మహా కార్యక్రమంగా మారనున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.