పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ABVP కార్యకర్తలు మంగళవారం మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.