ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఆటో సంఘాలు శనివారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించాయి. అసెంబ్లీ వద్దకు చేరుకున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఎన్నికల హామీల అమలు, ఆటో డ్రైవర్ల ప్రమాద బీమా రెన్యువల్, మహాలక్ష్మి పథకం వల్ల జీవనోపాధి కోల్పోతున్న వారిని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.