నాంపల్లి కోర్టు ఆవరణలోని అమ్మవారి ఆలయంలో సోమవారం బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ రవి కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సంధ్యారాణి, సుజాత, సురేఖ, శారద, స్రవంతి, పద్మావతి, భవిత, రేణుక, తదితరులు పాల్గొన్నారు.