ఫీజుల దోపిడీపై ఈనెల 25 ఇందిరా పార్క్ వద్ద ధర్నా

ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు చేస్తున్న ఫీజుల దోపిడీని నిరసిస్తూ ఈనెల 25న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా నేషనల్ రక్ష సేన పార్టీ అధ్యక్షులు టీ. నరసింహ యాదవ్ తెలిపారు. శుక్రవారం బషీర్ బాగ్ లో ధర్నాకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యాసంస్థలు ప్రతి ఏటా 10% నుండి 70% వరకు ఫీజులు పెంచుకుంటున్నాయని ఆరోపించారు. ప్రైవేటు స్కూల్ ఫీజుల దోపిడీని అరికట్టాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్