సచివాలయంలో నటించిన నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్

హైదరాబాద్ సచివాలయంలో కానిస్టేబుల్‌గా నటించి, ప్రజలను మోసం చేస్తున్న తటూరి రవి(31)ని సైఫాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. యూనిఫాం ధరించి, CMOలో పలుకుబడి ఉందని నమ్మించి, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం పోలీస్ వేషధారణలో హల్చల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి యూనిఫాం, నేమ్ ప్లేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అపరిచితుల మాటలు నమ్మి మోసపోవద్దని ఏసీపీ సంజయ్ కుమార్ ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్